మగధీర రికార్డుని శ్రీమంతుడు బ్రేక్ చేస్తాడ ?

Srimanthudu-magadheeraఇప్పుడు అందరి కళ్ళు మహేష్ బాబు శ్రిమంతుడి పైనే , వెండి తెర పై సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన బాహుబలి , దసరా కానుకగా బుల్లితెర పై సందడి చేసింది, టెలివిజన్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోందని అందరూ భావించారు. కానీ 21.84 రేటింగ్ తో మూడో ప్లేస్ ను దక్కించుకొంది .

‘రామదాసు’ 24 రేటింగ్ తో టాప్ పొజిషన్ లో ఉండగా, 22.77 రేటింగ్ తో ‘మగధీర’ రెండో స్థానంలో ఉన్నది . ఇప్పుడు మహేష్ బాబు శ్రీమంతుడు తన లక్ ను టెస్ట్ చేసుకోవడానికి నవంబర్ 8 బుల్లితెర పై సందడి చేయనున్నాడు .

రామదాసు రికార్డు పక్కన పెడితే , ప్రభాస్ బాహుబలి ఎలాగో రామ్ చరణ్ మగధీర రికార్డు ను బీట్ చేయలేక పోయాడు . మరి మన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రికార్డని తిరగరాస్తాడో లేదో చూడాలి.