ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎంతవరకైనా వెళతాం : డీజీపీ

dgp-apఫోన్‌ ట్యాపింగ్‌పై ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు.

మంగళవారం విశాఖపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు బాధ్యతలను సిట్‌కు అప్పగించాం. దర్యాప్తు సాగుతున్నందున, వివరాలను ఇప్పుడు బహిర్గతం చేయలేం. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎంతవరకైనా వెళతాం , అని తెలిపారు.

మరోపక్క, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందని కేసీఆర్ భయపడుతున్నారనీ, అందువల్లనే చంద్రబాబుకు ఎదురుపడలేకనే గవర్నర్ విందుకు గైర్హాజరయ్యారని అన్నారు లోకేష్.