గబ్బర్ సింగ్ 2 సర్దార్ గా ఎందుకు మారాడు ?

PawanKalyan-Sardar-movie-photosగబ్బర్ సింగ్ 2కి సర్దార్ అని టైటిల్ మార్చడం వెనక ప్రధానకారణం పవన్ కళ్యాణ్ అని టాక్ వినిపిస్తోంది . పవన్‌కు గబ్బర్ సింగ్ 2 టైటిల్‌పై ఆసక్తి చూపించలేదు . మరో కారణం కూడా వుంది .

తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్స్‌కు బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉండటం. ఇప్పటివరకు తెలుగులో ఏ ఒక్క సీక్వెల్ కూడా హిట్ అవ్వలేదు. మనీ , శంకర్‌దాదా ఎంబిబిఎస్, ఆర్య, గాయం ఇవన్నీ తొలిభాగాలు హిట్.. సీక్వెల్స్ అన్నీ పరాజయాలే. గబ్బర్ సింగ్ 2 టైటిల్ సర్దార్‌గా మారడంలో ఈ సెంటిమెంట్ ని కూడా పరిగణంలోకి తీసుకున్నారు అని టాక్ .