విభజించి నప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు : చంద్రబాబు

naidu1ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని , చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదాపై కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తెస్తున్నామని చంద్రబాబు చెప్పారు.ప్రత్యేక హోదాపై ఎవరూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని చంద్రబాబు జగన్ ను హెచ్చరించారు. కేసుల కోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని విభజించిన పాపం వైయస్సార్ పార్టీదేనని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పార్లమెంట్ లో తలుపులు మూసేసి ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో వెంకయ్య నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. విమర్శించే హక్కు వీరికి లేదని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే ఎన్డీయేతో కలుస్తారా అని వైసీపీని ప్రశ్నించారు.