రామోజీరావును జగన్‌ కలిస్తే తప్పేంటని ?

jagan-ramojiవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ‘ఈనాడు’ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో రామోజీ ఫిల్మ్ సిటీలో భేటి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

జగన్‌ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో రామోజీ దగ్గరకు వెళ్లారన్నారు. రామోజీరావును ఎందుకు కలిశారో జగన్‌ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు .

రామోజీరావును జగన్‌ కలిస్తే తప్పేంటని వైసీపీ నేత పెద్దిరెడ్డి ఎదురు దాడికి దిగారు .

జ‌గ‌న్-రామోజీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నించి ఇద్దరు కలిసే వరకు వచ్చిన హ‌ఠాత్తుగా ప‌రిస్థితులకి కారణం తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అని సమాచారం .

కరుణాకరరెడ్డి ఇంటిలో త్వరలో జరిగే శుభకార్యానికి రామోజీరావును కూడా ఆహ్వానించాలని అనటంతో , జగన్ తను కూడా వస్తా అనటంతో , నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావుకు భూమన ఆహ్వాన పత్రిక అందజేశారు. ముగ్గురూ కలిసి దాదాపు గంటకు పైగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.