ఎన్టీయార్‌ తో ‘అదుర్స్‌’ కు సీక్వెల్‌ ప్లాన్ చేసున్న వినాయక్‌

ntr-adhurs ,మాస్‌ డైరెక్టర్‌ వినాయక్‌ కంబినేషన్లో వచ్చిన ‘ఆది’, ‘సాంబ’, ‘అదుర్స్‌’ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి . ‘అదుర్స్‌’ తరువాత ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.

‘జనతాగ్యారేజ్‌’ వంటి విజయవంతమైన సినిమా మంచి ఊపుమీదున్న ఎన్టీయార్‌ తన తరువాత సినిమాపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఒకపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు, పూరి జగన్నాధ్ ల పేర్లు వినబడుతున్నాయి. మరోపక్క వినాయక్‌తో సినిమా చేయాలని ఎన్టీయార్‌ భావిస్తున్నట్టు సామాచారం.

వీరిద్దరూ ‘అదుర్స్‌’ కు సీక్వెల్‌ ప్లాన్ చేసున్నట్లు సమాచారం . ఐతే ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా పనులతో వినాయక్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ కి కంప్లీట్ అవ్వుతుంది. మరి అప్పటివరకు ఎన్టీయార్‌ వెయిట్ చేస్తాడా ? లేక పూరితో సినిమా స్టార్ట్ చేస్తాడా ?.