విజయకాంత్ కు ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదు : రాధికా

rahika-vijaykanthడీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే సత్తా లేదని శరత్ కుమార్ భార్య, నటి రాధికా వ్యాఖ్యానించారు.

అన్నాడీఎంకే కూటమి తరఫున రాధిక ప్రచారం చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయ్ కాంత్ తో తమిళనాడుకు ఒరిగేదేమీ ఉండదని , విజయకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారు, విజయకాంత్‌ అనారోగ్యంతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదని, ఆయన సత్తా ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు. కేవలం విజయ్ కాంత్ టార్గెట్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళ ప్రజలకు అమ్మజయలలిత ఎంతోచేసారని పొగిడేశారు.

జయలలితకూటమి తరపున శరత్ కుమార్ పోటీచేస్తున్నారు, దీంతో శరత్ కుమార్ భార్య, రాధికా , తిరుచెందూర్‌ నియోజకవర్గం ఆయన తరఫున రాధిక ప్రచారం చేశారు.