విజయ్ పులి సినిమా స్టొరీ లీక్

puliహీరో విజయ్ చిత్రం పులి సినిమా 18 నిమిషాలు లీక్ అయిందన్న వార్త కోలీవుడ్ లో సంచలనం రేపింది ఐతే ఇవ్వని కేవలం పుకార్లు అని ఆ సినిమా డైరెక్టర్ కొట్టిపారేసారు .

లీకు వీడియో ప్రకారం సినిమా కథ ఇలా ఉందట. విజయ్ గర్ల్ ఫ్రెండ్ నందిత. ఐతే ఆమెను కొందరు దుండగులు అత్యంత దారుణంగా హతమారుస్తారు. ఇది తెలుసుకున్న విజయ్ తీవ్ర మనోవేదనకు గురై ఓ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆసక్తికరంగా… అతడు కొండ పైనుంచి పడే చోటు శ్రీదేవి పాలిస్తున్న ప్రాంతం. ఇక అక్కడే విజయ్ తన జీవితాన్ని సాగిస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటాడు.

ఐతే ఇది నచ్చని సందీప్ అతడిని ఓ అవసరంలేని పోరాటాన్ని ఎదుర్కొనేలా చేస్తాడు. ఐతే ఇది నమ్మని శ్రీదేవి, తనకున్న ఆధ్యాత్మిక శక్తుల ద్వారా పరిశీలిస్తుంది. అందులో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమంటే… విజయ్ చిన్నప్పుడు తప్పిపోయిన తన కుమారుడేనన్నది.