‘జేబుదొంగ’ గా మారిన వరుణ్ తేజ్ ‘లోఫర్ ‘

loafer-jobudongaవరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటివరకూ లోఫర్ టైటిల్ తో పిలుచుకున్నారు కానీ దాని టైటిల్ మారింది .

చిరంజీవి పాటలపై డాన్సులు చేసి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హిట్లు కొడితే , చిరంజీవి సినిమా టైటిల్ ను వాడుకోబోతున్నాడు చిరంజీవి తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్.

ఒకప్పుడు చిరంజీవి హీరోగా నటించిన  ‘జేబుదొంగ’  టైటిల్ ను ఈ సినిమాకి ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది . అదే కాదు , సినిమా రషెస్ చూసిన నిర్మాత సి.కళ్యాణ్ తో పాటు రామ్ గోపాల్ వర్మ దాని టైటిల్ మార్చమని సలహా ఇచ్చారు .

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత మళ్లీ మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నడు పూరి జగన్నాథ్ . వరుణ్ తేజ్ కు తల్లిగా రేవతి , తండ్రిగా పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు.