ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త

aadhaar-cardఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త !

ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడిన సంఘటన గుర్తొస్తుందా.

అయితే ఇక నుంచి ఈ కష్టాలు తప్పనున్నాయి. ఆధార్‌లో మార్పుల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే మీ పని చాలా సులభం.

మీ ఆధార్‌లో తప్పులు, పేరులో మార్పులుచేర్పులు, ఫోన్ నెంబర్ వంటి వాటిని మార్చుకోవడం చిటికెలో పని. http://uidai.gov.in/update-your-aadhar-data.html ను ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లోనే ఈ మార్పులన్నీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కాళ్లకు పనిచెప్పడం మానేసి, వేళ్లకు పని చెప్పండి.