తుని ఘటన దురృష్టకరం : పవన్ కళ్యాణ్

pk1జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ , తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జనలో హింసాత్మక సంఘటనలు పై వ్యాఖ్యానించారు.

కాపు గర్జన సభ సమయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని , ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన చెప్పారు. . తగినంత పోలీస్‌ ఫోర్స్‌ను సభా ప్రాంగణం వద్ద నియమించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదని , రైలు దగ్ధం అనేది చిన్న సంఘటన కాదని , ప్రజాస్వామ్యంలో వారికి మాట్లాడే హక్కు ఉందని అన్నారు.కాని హింస జరగడం దురృష్టకరమన్నారు.

దీని వెనుక సంఘ వ్యతిరేక శక్తులు ఉంటే తప్ప ఇది జరగదని ,.తాను ఎవరిపై ఆరోపణలు చేయబోనని, కాని హింస జరగడం దురృష్టకరమన్నారు.