తెలంగాణాలో తుగ్లక్ పాలన నడుస్తోంది : మోత్కుపల్లి

Motkupalli-Narasimhuluవిపక్షాలు రైతుల ఆత్మహత్యలపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శకు తెలుగు దేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 1,314 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు .

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎక్కడ 6 లక్షల పరిహారం అందలేదని , పరిహారం కింద రూ.లక్షన్నర మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ కోసం 1,200 మంది చనిపోతే అందులో 400 మందికె 10 లక్షలు ఇచ్చారని , మిగతా కుటుంబాలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణా లో రాయకియలు కేసీఆర్ ఫార్మ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నాయని విమర్శించారు.