తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి ఉద్యోగ నోటిఫికేషన్

tspsc-notofication-released-4747778తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 770ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు అని చెప్పారు.  తోలి  విడతలో మొత్తం  3,783 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు టీ.ఎస్.పీ.ఎస్.సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ఏఈఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పద్ధతిలో సెప్టెంబర్ 20న రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 3. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. అందులో రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయన్నారు.

మరో వారం రోజుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ల ఉద్యోగాల ప్రకటన వస్తుందన్నారు. అసిస్టెంట్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. మరో వారంలో వచ్చే నోటిఫికేషన్ల ద్వారా  మొత్తం 3,783 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పంచాయితీరాజ్శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటిపారుదలశాఖల్లో భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీ.ఎస్.పీ.ఎస్.సీ సన్నాహాలు చేస్తోంది.

Visit www.tspsc.gov.in for more details