ట్విట్టర్ బాబుపై తెరాస విసుర్లు

lokeshఫోన్ ట్యాపింగ్ భయంతో టి.సర్కార్ వణుకుతోందని అన్నారు. ఆ భయమే లేకపోతే తెలంగాణ సర్కారు హోంశాఖ కార్యదర్శిని ఎందుకు మార్చారు? ఇంటెలిజన్స్ చీఫ్ దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు, నారా లోకేశ్. చంద్రబాబుకు ఎదురుపడలేకనే గవర్నర్ విందుకు గైర్హాజరయ్యారని అన్నారు లోకేష్

దీనికి దీటైన సమాదానంతో తెరాస నాయకులూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్ ఓ రాజకీయ అజ్ఞాని అని, ట్విట్టర్ బాబు అని టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుది కాదని ఈ ట్విట్టర్ బాబు చెప్పగలడా అని టీఆర్ఎస్ ఎంపి బాల్కే సుమన్ తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్‌కు లేదని అన్నారు. అసలు, సీఎం కేసీఆర్‌కు ఎదురుపడే ధైర్యం లేకనే చంద్రబాబు హకీంపేట్ ఎయిర్‌పోర్టు వద్దకు రాలేదని ఎద్దేవా చేశారు.