పవన్ కల్యాణ్‌పై పోలీసులకు టి.లాయర్ల ఫిర్యాదు

pawan1జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తెలంగాణ న్యాయవాదులు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తమ ఫిర్యాదులో ఆరోపించారు.

ఆయన మాటలు ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని జనసేన అధినేతకు టి.లాయర్లు హితవు పలికారు.