తెదేపా పార్టీ రాష్ట్రల అధ్యక్షులు : తెలంగాణా – ఎల్‌.రమణ, ఎపి -కళావెంకట్రావు

kala-venkata-raoతెదేపా పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ కమిటీని, ఎపి పార్టీ కమిటీ ప్రకటించారు.

ఎపి పార్టీ కమిటీ అధ్యక్షునిగా సీనియర్‌నేత కిమిడి కళావెంకట్రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీలో మొత్తం 70 మందికి స్థానం కల్పించారు. ఎపి పార్టీ ఉపాధ్యక్షులుగా కరణం బలరమ్‌, వెంకటేశ్వర చౌదరి, ప్రధాన కార్యదర్శులుగా బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, జెఆర్‌ పుష్పరాజ్‌, మెట్ల సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, రామానాయుడు, నాగేశ్వర్‌రెడ్డి, అధికారప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, పంచుమర్తి అనూరాధ, లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్‌ నియమితులయ్యారు.

తెలంగాణ తెదేపా రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా పార్టీ నేత ఎల్‌.రమణ నియమితుయ్యారు. మొత్తం 98 మంది  కమిటీలో ఉన్నారు. వర్కింగ్‌ కమిటీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా మండవ వెంకటేశ్వరరావు, స్వామిగౌడ్‌, సాయన్న, అన్నపూర్ణమ్మ,యూసఫ్‌ ఆలీ, చాడా సురేష్‌రెడ్డి, కృష్ణయాదవ్‌, అరికపూడి గాంధీ తదితరులు నియమితులయ్యారు.

పాలిట్ బ్యూరోలో కె.ఇ.కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్,నిమ్మకాయల చినరాజప్ప,అయ్యన్నపాత్రుడు,రావుల చంద్రశేఖరరెడ్డి, యనమల రామకృష్ణుడు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావు, నామా నాగేశ్వరరావు, ప్రతిభా భారతి , రమేష్ రాధోడ్, ఉమా మాదవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు.ఉపాధ్యక్షులుగా ,ప్రదాన కార్యదర్శులుగా లోకేష్, పి.రాములు,మాగుంట శ్రీనివాసులురెడ్డి, కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి గరికపాటి మోహన్ రావు తదితరులను నియమితులయ్యారు.