తెలంగాణ ప్రత్యేక దేశం కాదు.. ప్రత్యేక రాష్ట్రమే :పవన్

pawan1తెలంగాణ ప్రత్యేక దేశం కాదు.. ప్రత్యేక రాష్ట్రమే…తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు, తెలంగాణ అన్నది దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే అని… ప్రత్యేక దేశం కాదన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని కల్యాణ్‌ హితవు చెప్పారు, జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాడ్డక కూడా ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. హరీశ్ రావు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు.

1960లోనే ఉమ్మడి రాష్ర్టాన్ని విడదీస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు. ఆంధ్ర అంటే ఒక జాతి అని వివరిస్తూ వారిలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు.

తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు తెలుగుజాతి ఐక్యతకు తొలి అడుగు వేశారా అనిపించింది. యాదాద్రి గుడికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి అనే ఆర్కిటెక్టును పెట్టడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.