తెలంగాణ ప్రభుత్వం పోన్ టాపింగ్ చేసినట్లు ఒప్పుకుంది

kcr-liquourతెలంగాణ ప్రభుత్వం పోన్ టాపింగ్ చేసినట్లు ఒప్పుకుందా?. ఫోన్‌ ట్యాపింగ్‌ సంబంధించి విజయవాడలోని చీఫ్‌ మెట్రో పాలిటిన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. తాము పబ్లిక్ ఆర్డర్ కోసం పోన్ టాపింగ్ చేశామని, వాటిని బహిర్గతం చేయరాదని కేంద్ర ప్రభుత్వం జూలై పదమూడున రాసిన లేఖలో అబిప్రాయపడిందని ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సభ్యులతోపాటు విజయవాడలోని తన ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోన్లను ట్యాప్‌ చేశారంటూ జూన్‌ 8వ తేదీన దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు . దాని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ అధికారులు.

ఈ కేసులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర సమాచార, ఐటీ, టెలికమ్యూనికేషన్‌ శాఖ కార్యదర్శి, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ డీఎస్పీ, టెలికం ఆపరేటర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యూలార్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.