తెలంగాణలో టీడీపీ పుంజుకుంటోంది , 3 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు

tdpతెలంగాణలో టీడీపీ క్రమంగా పుంజుకుంటోంది , మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలో జరిగిన మూడు ఎంపీటీసీల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం బూనీడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై 692 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవీ విజయం సాధించారు. బూనీడు గ్రామం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో ఉంది.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలంకాయపల్లిలో 166 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి మట్కు గెలుపొందారు.

వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో 75 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాజు విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఎంపీటీసీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది.