ట్రూజెట్ విమానంలో టీడీపీ నేతలకు టెన్షన్

tue-jetఉత్తరాంద్ర తెలుగుదేశం నేతలు , టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా గంట సేపు ఆకాశంలోనే ఉండవలసి రావడం ఉత్కంఠకు దారి తీసింది. గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టి, సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నెల్లూరు లో జరిగిన మంత్రులు నారాయణ, గంట శ్రీనివాసరావుల పిల్లల పళ్లి సందర్బంగా ప్రత్యేక విమానంలో ఉత్తరాంద్రకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి రాకపోవడంతో ఉత్కంఠకు దారి తీసింది.