పవన్ కల్యాణ్‌పై ముప్పేట దాడికి దిగిన టీడీపీ నేతలు

images (1)నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాని పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్స్‌పై టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ చట్టం ప్రయోగానికి సంబంధించి పవన్ కల్యాణ్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు.

మరోవైపు రాజధాని భూ సేకరణకు సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుంటుందని, మొత్తం వ్యవహారాన్ని స్టడీ చేశాక పవన్ కల్యాణ్ సలహాలిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోమిరెడ్డి సూచించారు. ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేందుకు భూసమీకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని, పవన్‌ కళ్యాణ్‌ సదుద్దేశంతోనే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, రాజధాని నిర్మాణ అవసరాలను గుర్తించాలని సోమిరెడ్డి కోరారు.