టీడీపీ పరువు జయదేవ్‌ చేతుల్లో పెట్టిన చంద్రబాబు

jaidev-chandrababuటీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పరువు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చేతుల్లో పెట్టారు . టీడీపీ సీనియర్ ఎంపీల్లో ఆంగ్ల పరిజ్ఞానం నామమాత్రంగానే ఉండడంతో జాతీయ మీడియా వద్ద పార్టీ పరువు కాపాడాలంటూ గల్లా జయదేవ్‌కు విజ్ఞప్తి చేశారు.

గోదావరి పుష్కరాల తొక్కిసలాట సమయంలో జాతీయ మీడియా ముందు వచ్చీరానీ ఇంగ్లీషులో మాట్లాడిన ఒకరిద్దరు ఏపీ మంత్రులు తమ పరువునే కాకుండా, పార్టీ పరువు కూడా తీశారు. దీంతో జాతీయ స్థాయిలో మీడియా తో మాట్లాడే బాధ్యతలను గల్లా జయదేవ్‌కు అప్పగించారు . ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను జాతీయ మీడియాకు తెలియచేసే బాధ్యతలను కూడా గల్లా జయదేవ్‌కు అప్పగించారు.