తలసాని రాజీనామా చేసే యోచన

talasaniతెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగ గెలిచి కేసీఆర్ కేబినెట్‌లో ఆరు నెల‌లుగా మంత్రిపదవి అనుభవిస్తూన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసే యోచన ఉన్నారు .

స‌న‌త్ న‌గ‌ర్ నుండి టీడీపీ త‌ర‌ఫున‌ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని గతేడాది డిసెంబర్ 16న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టిడిపి ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు , మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం కూడా చేసారు .

కానీ రాజీనామా లేఖ తెలంగాణా స్పీక‌ర్ కార్యాలయానికి పంపలేదు ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణా స్పీక‌ర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హ‌రీష్‌, స్పీక‌ర్ మ‌ధుసూధనాచారి చ‌ర్చించారు . తలసాని శ్రీనివాస్ యాదవ్ని రాజీనామా చేయమని సలహా ఇచ్చినట్లు సమాచారం.