పిలిం చాంబర్ ఎన్నికలలో సురేష్ బాబు ప్యానల్ విజయం

suresh-babuతెలుగు పిలిం చాంబర్ కు జరిగిన ఎన్నికలలో ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు పానల్ విజయం సాదించింది.డిప్ట్రిబ్యూటర్ విబాగంలో సురేష్ బాబు పానల్ కు చెందిన పదమూడు మంది , నట్టి కుమార్ ప్యానల్ తరపున ముగ్గురు ఎన్నికయ్యారు. కాగా స్టూడియో సెక్టార్‌కు ప్రసన్న, నట్టి కుమార్ ప్యానల్ తరపున బసిరెడ్డి రామకృష్ణ, జెమిని కిరణ్ విజయం సాదించారు. సురేష్ బాబు ప్యానల్ నుంచి సి.కల్యాణ్ గెలిచారు.

ఈ ఎన్నికలకు రెండు ప్యానల్స్‌ పోటీ చేస్తున్నాయి. డి.సురేష్‌ బాబు, దిల్‌ రాజు, ఠాగూర్‌ మధు.. అంటే అగ్రనిర్మాతలంతా ఓ ప్యానల్. రెండో ప్యానల్‌గా దాసరి ఆశీస్సులతో చిన్న నిర్మాతలంతా నట్టికుమార్‌, ప్రసన్న కుమార్‌తో పాటు అశ్వనీదత్‌ కూడా ఇందులో ఉన్నారు.

వాణిజ్యమండలి(ఛాంబర్‌)లో నిర్మాతల మండలి, పంపిణీదారులు, ప్రదర్శనదారులు, స్టూడియో సెక్టార్‌ అనే నాలుగు భాగాలుంటాయి. దాదాపు రెండువేలకు పైగా సభ్యులున్నారు. వీరిలో ఫైనల్‌గా 48 మంది వివిధ పదవులకు ఎంపిక అవుతారు. వీరంతా కలిసి ఎన్నుకున్నవాడే వాణిజ్యమండలి అధ్యక్షుడు అవుతారు.