సూపర్ స్టార్ కిడ్నాప్ రివ్యూ

superstar-kidnap‘సూపర్ స్టార్ కిడ్నాప్’
నటీనటులు : నందు, ఆదర్శ్‌ బాలకృష్ణ, శ్రద్ధ దాస్‌, భూపాల్‌, ఫిష్‌ వెంకట్‌ తదితరులు; సంగీతం : సాయి కార్తీక్‌
దర్శకత్వం : సుశాంత్‌ రెడ్డి
నిర్మాత : చందు
రేటింగ్‌: 2.5/5
కథ :
మహేష్ బాబుతో సినిమా తీసే నిర్మాత కొడుకు జై(ఆదర్ష్‌ బాలకృష్ణ). చిన్నప్పుడే తల్లి చనిపోవడం వలన అన్ని బాధ్యతలు మరిచి డ్రగ్స్‌కి అలవాటుపడతాడు. రెండో వాడు నందు(నందు) ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి(పూనమ్‌ కౌర్‌) హాండ్‌ ఇవ్వడంతో తనని మళ్లీ ఎలా అయినా దక్కించుకోవాలి అనుకుంటాడు. ఇక మూడో వాడు భూపాల్‌(భూపాల్‌) ఖుషి సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయి ఎప్పటికైనా దర్శకుడు కావాలని ఊరు నుంచి వస్తాడు. ముగ్గురి సమస్య డబ్బే. అందుకే వారంతా కలిసి కిడ్నాప్‌ ప్లాన్‌ చేస్తారు. అది మహేష్‌ బాబు అయితే బెటర్‌ అనే నిర్ణయానికి వస్తారు. వారు వేసిన ప్లాన్‌ ప్రకారం మహేష్‌కు బదులు అనుకోకుండా కమేడియన్‌ వెన్నెల కిశోర్‌ను కిడ్నాప్‌ చేస్తారు. ఆ కిడ్నాప్‌ వల్ల వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి.? అన్నది మీరు వెండి తెరపైనే చూడాలి.

పెర్‌ఫార్మెన్స్ ‌:
చిన్నాచితకా చిత్రాలు చేస్తూ గుర్తింపు పొందుతున్న నందు, ఆదర్శ్‌ బాలకృష్ణ, భూపాల్‌లు ఈ చిత్రంలో మంచి నటనని కనబరిచారు. ఓ లవర్‌ బాయ్‌‌గా నందు మంచి నటనని కనబరిచాడు. ఓ టాప్‌ సినీ నిర్మాత కొడుకుగా, డ్రగ్‌ అడిక్ట్‌ పాత్రలో ఆదర్శ్‌ బాలకృష్ణ బాగా నటించాడు. భూపాల్‌ తెలంగాణ కుర్రాడిగా, తెలంగాణా స్లాంగ్‌‌లో అక్కడక్కడా నవ్వించాడు. వీరు కాకుండా శ్రద్ధదాస్‌ లేడీ డాన్‌గా చేసింది. ఓల్డ్‌ సిటీలో ఫరాఖాన్‌ అనే డాన్‌ పాత్ర పోషించింది. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌ ఉన్నంతసేపూ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పూనంకౌర్‌ ఇప్పటి ట్రెండ్‌కు తగిన యువతిలా నటించింది.

విశ్లేషణ :

ఈశ్వర్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. 5డి కెమెరాతో చేసేశాడు. కిడ్నాప్‌ బ్లాక్‌, ఆ తర్వాత చేజింగ్‌ బ్లాక్‌ ఎపిసోడ్స్‌, మనోజ్‌ ఎపిసోడ్‌‌ని చాలా బాగా చూపించాడు. ఇచ్చిన బడ్జెట్‌లో ఇంతలా గ్రాండ్‌ విజువల్స్‌ ఇవ్వడం మెచ్చుకోదగిన విషయం. సాయి కార్తీక్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగా హెల్ప్‌ అయ్యింది. మధు జి రెడ్డి ఎడిటింగ్‌ యావరేజ్‌‌గా ఉంది. డైలాగ్స్‌ క్యాచీగా వున్నాయి.

దర్శకుడు తీసుకున్న కథ  కొత్త కాకపోయినా.. కిడ్నాప్‌ పాయింట్‌ కొత్తది. సుశాంత్‌ రెడ్డి కథని ట్రీట్‌ చేసిన విధానం బాగుంది. అయితే కథనం మీద ఇంకాస్త వర్కౌట్‌ చెయ్యాల్సింది. నిర్మాత చందు నిర్మాణ విలువలు బాగా రిచ్‌‌గా ఉన్నాయి. చిన్న బడ్జెట్‌ సినిమా అయినా సినిమాలో ఆ ఫీలింగ్‌ ఎక్కడా కనిపించదు. మొదటి భాగం కంటే సెకండాఫ్‌ రకరకాల గ్యాంగ్‌తో కథను ఎంటర్‌టైన్‌ చేశాడు. కథ ప్రకారం పాటలు వుపయోగం లేకపోయినా.. నిడివి కోసం పాటలు పెట్టాల్సి వచ్చింది. యానిమేషన్‌ పై వచ్చే సాంగ్‌. శ్రద్ధ దాస్‌, పోసాని లాంటి పాత్రలు బాగానే డీల్‌ చేశాడు.

ఇటీవల సస్పెన్స్‌, క్రైమ్‌ కామెడీ ఫార్మాట్‌లో చాలా చిత్రాలు వస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పేరునే కాకుండా, తనని కిడ్నాప్‌ చెయ్యడమే ఇతివృత్తంగా ఈ సినిమా నడవడం సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యింది. నటీనటుల పెర్ఫార్మన్స్‌, వెన్నెల కిషోర్‌ కొన్ని కామెడీ బిట్స్‌ తనపై తాను సెటైర్లు నవ్వు తెప్పిస్తాయి. ముగింపులో మనోజ్‌, అల్లరి నరేష్‌, నాని, తనీష్‌ల గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అవుతాయి. అవి కూడా సినిమాటిక్‌గా వచ్చి వెళ్ళిపోతుంటాయి.

అలాగే సినిమా మొదలు పెట్టడమే బిజినెస్‌‌మేన్‌ లాస్ట్‌ డైలాగ్‌(నీ ఎయిం 10 మైల్స్‌ అయితే ఎయిం ఫర్‌ 11థ్‌ మైల్‌)ని చూపించడం ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయిస్తుంది. సినిమా మొదట్లో పాత్రలని పరిచయం చేసిన విధానం కూడా బాగుంటుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌‌లో మహేష్‌ బాబుని కిడ్నాప్‌ చేయాలనుకునే బ్లాక్‌ ఆసక్తికరంగా సాగుతుంది. చిన్నపాటి లోపాలున్నా… డబ్బు పెట్టిన ప్రేక్షకుడ్ని ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా తీయడంలో ఫర్వాలేదనిపించాడు.