దూకుడు తగించండి ! తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్

naidu-kcrఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటిదాకా జరిగింది చాలు! ఇంతకు మించి వద్దు ! అని ఉభయ రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం.

గురువారం తమను కలిసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్‌లు ఇకపై దూకుడు తగ్గించకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని కాస్త మృదువుగానే హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళితే మీకే ఇబ్బంది వచ్చే ప్రమాదముంది అని తెలంగాణ సర్కారుకు పరోక్ష సంకేతాలు కూడా పంపించారు. కేటీఆర్‌ ద్వారా కేసీఆర్‌కు ఆయన కీలక సందేశం పంపినట్లు తెలుస్తోంది.

మరోవైపు టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై తమకు లభించిన ఆధారాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ చేసి నివేదిక రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. ట్యాపింగ్‌ తీవ్రమైన నేరమని, కేసీఆర్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని అని కేంద్రం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడో, రేపో పూర్తిగా చల్లబడే అవకాశాలు లేకపోలేదు .