పవన్ కళ్యాణ్ పై రాయి పడింది

pawan1జనసేన వ్యవస్థాపకుడు ,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా పెనబాకలో రైతులతో కూర్చొని మాట్లాడుతుండగా ఎవరో ఆగంతకుడు రాయి విసిరాడు.

జనసేన అధినేతకు ఎలాంటి హానీ జరగలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాయి విసిరినప్పుడు కొద్దిసేపు పవన్ కళ్యాణ్ కొంత ఆశ్చర్యంగా చూశారు. ఆ రాయిని ఆయన చేతిలో తీసుకుని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ తిరిగి  రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాయి విసిరిన దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు.