బాహుబలిని దెబ్బే కొట్టిన శ్రీమంతుడు

srimanthudu-baahubaliమహేష్ బాబు శ్రీమంతుడు సినిమా తో రాజమౌళి కె షాక్ ఇచ్చాడు , మూవీ విడుదల రోజే పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మహేష్ బాబు కెరీరీర్ లోనే రికార్డ్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.

మహేష్ బాబు తన సత్తా ఏమిటో మరోసారి ‘శ్రీమంతుడు’ సినిమాతో నిరూపించాడు, వందల కోట్లు పెట్టి తీసిన బాహుబలి సినిమా తో సమానంగా శ్రీమంతుడు జస్ట్ 50+ కోట్ల తో తీసి కలెక్షన్స్ వాసులు చేసున్నాడు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు . ఇది చాలు స్టార్ హీరో పవర్ ప్రూవ్ చేయటానికి .

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమెరికా లో కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది.ఈ చిత్రం గురువారం , శుక్రవారం , ఆదివారం వసూళ్ళు కలుపుకొని 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇదే సినిమా బాహుబలి రిలీజ్ ఐన వారానికే రిలీజ్ చేసుంటే బాహుబలి కి పెద్ద దెబ్బై ఉండేదని ట్రేడ్ వర్గాల అబిప్రాయం .

బాహుబలి ఆడుతున్న థియేటర్స్ ని కబ్జా చేసి ఆ సినిమాకు చుక్కలు చూపిస్తున్నాడు శ్రీమంతుడు , అగ్రిమెంట్ ప్రకారం మొదటి 3 రోజులు శ్రిమంతుడికి ఇచ్చిన బాహుబలి థియేటర్స్ లో కలెక్షన్స్ ల సునామి సృష్టించడంతో ఆ ధియేటర్ వాళ్ళు శ్రిమంతుడినే వారంతం వరకు కంటిన్యూ చేయాలనీ అనుకొంటున్నారు . ఇది బాహుబలికి పెద్ద దెబ్బే మరి !!.