ఏపీ, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టులు త్వరలోనే

highcourtపార్లమెంట్లో ప్రత్యేక హైకోర్టులపై ఏర్పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. బీజేపీ అధికారంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేశాము. గతంలోనే యూపీఏ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచింది. ఇపుడు కాంగ్రెస్ వల్లే ఏపీకి ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్ధిక సంక్షోబంలో ఉందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా హై కోర్టును విభజిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో గళం వినిపించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్ విభజన చట్టంలో స్పష్టంగా ఉందని,అయితే హైకోర్టు విభజనపై కేంద్రం కావాలానే తాత్సారం చేస్తోందని, వారం రోజుల్లోనే హైకోర్టులు ఏర్పాటు చేశారని డిమాండ్ చేశారు..

టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉన్నట్టే… ఏపీ హైకోర్టు కూడా హైదరాబాద్ లో ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు . ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని భవనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటన కూడా చేశారని , వినోద్ అన్నారు. హైకోర్టు విభజన కేవలం పొలిటికల్ డెసిషన్ మాత్రమే అన్నారాయన .