సే నో టూ డ్రగ్స్ అని పిలుపునిచ్చిన తనీష్‌

tanish-drugsడ్రగ్స్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో తనీష్‌.

అబ్కారీ కార్యాలయంలో ఈ ఉదయం వచ్చిన తనీష్‌ ను నాలుగు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత తనీష్‌ విలేకరులతో మాట్లాడారు.

సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడం బాధాకరమని చెప్పారు. మీడియాలో కథనాలు ప్రసారం చేసే ముందు ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనపై వస్తున్న కథనాలతో తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకం ప్రమాదకరం.. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. సే నో టూ డ్రగ్స్ అని పిలుపునిచ్చారు, తనీష్ .

డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నటుడు సుబ్బరాజు, హీరోయిన్‌ చార్మి, ముమైత్‌ ఖాన్‌, హీరో రవితేజ, నవదీప్‌ తరుణ్‌లను సిట్ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం హీరో నందు విచారణకు హాజరు కానున్నారు.