హై కోర్టుకు ఎక్కిన సాక్షి టీవీ ప్రసారాల రగడ

sakshiఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో సాక్షి టెలివిజన్ హైకోర్టుకు వెళ్లింది, ఆది కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరుపై హైదరాబాద్ లో జర్నలిస్టులు పెద్ద ఎ నిరసన తెలిపారు.

సాక్షి టీవీ ప్రసారాలు జరిగేలా చూడాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఎపి హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, కేంద్ర సమాచార కార్యదర్శి , టెలికమ్ రెగ్యులేటరీ అదారిటి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

జర్నలిస్టు నేతలు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, వరదాచారి,నగేష్, షమీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమరనాద్,నరేంద్ర రెడ్డి, బండారు శ్రీనివరావు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి,ఎడిటర్ మురళీ, దిలీప్ రెడ్డి తదితరులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.

మరోపక్క వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని సాక్షి టీవీని రాకుండా కేటుల్ ఆపరేటర్లు చేస్తున్నారని, మరి కొన్ని రోజులపాటు సాక్షి టీవీని చూపించకపోతే, రాష్ట్రంలో ఏ టీవీ రాకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.