అమరావతిలో రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు, 2019 ఎన్నికలే టార్గెట్‌గా ప్లీనరీ సమావేశం జరుగుతోంది .
వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడటానికి రాగ , వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి రోజా దగ్గరకి వచ్చి “జగనన్న చంద్రబాబుని బాగా తిట్టమన్నాడు”.
రోజా మాట్లాడుతూ, చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు చూస్తూ చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాలన అద్వాన్నంగా తయారైందని, ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రి జవహర్ బీరును హెల్త్ డ్రింక్ అని అంటున్నారని, అన్నారు .
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైంది, డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టారు అన్నారు . ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు అని ఆరోపించారు రోజా .