చంద్రబాబు లోకేష్ పై మండిపడ్డ రోజా

rp_roja-300x280-1-300x280.jpgవైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ పై మండిపడ్డారు .

ప్రతిపక్షాలు, జర్నలిస్టుల, మీడియా, అధికారులను కాకుండా ఓటర్లనే బెదిరించే పరిస్థితికి వచ్చాడన్నారు. మీ నాన్న ఖర్జూరనాయుడు సొత్తా..? మీ మామ ఎన్టీఆర్ సొత్తా…మీపుత్రుడు లోకేష్ సొత్తా..? ప్రజలు కట్టే పన్నులతో సంక్షేమ పథకాలు పెట్టి నా సొత్త అని మాట్లాడుతావా ప్రజల సొత్తును అనుభవిస్తూ సిగ్గులేకుండా వారినే బెదిరిస్తావా అంటూ రోజా బాబుపై ధ్వజమెత్తారు.

30వేల మందికో బార్ అంటూ కొత్తగా 85 బార్లకు లైసెన్స్ లిచ్చారంటే , క్యాబినెట్ లో ఉన్న తాగుబోతులంతా తీసుకున్న బార్ల పాలసీ అని అర్థమవుతోందని రోజా ఎద్దేవా చేశారు. 30వేల మందికో అంబులెన్స్, ఆస్పత్రి, మంచినీటి పథకం పెట్టడం చేతగాదు గానీ….బార్ లను పెట్టేందుకు మాత్రం జీవో విడుదల చేశారంటే ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు అనే దానికన్నా సారా చంద్రబార్ నాయుడు అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అంటూ రోజా బాబుపై ధ్వజమెత్తారు.

తాను పనికిమాలిన టీడీపీలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తేలేదు, తలాతోక లేని జనసేనలోకి కూడా వెళ్లను అన్నారు వైసీపీ ఎమ్మెల్యే. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్‌సీపీలోనే ఉంటా, నాకు రాజకీయంగా గౌరవం ఇచ్చిన వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.

జయంతి, వర్ధంతికి తేడా తెలియని వాళ్లు కూడా వైఎస్ జగన్‌ను సవాళ్లు చేస్తున్నారు, ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్త, తర్వాత జగన్‌కు సవాళ్లు విసురొచ్చు అన్నారు ఎమ్మెల్యే రోజా.