పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన రోజా

Pawan-Kalyan-rojaఏపీ ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో లాలూచీ పడ్డారని వైకాపా ఎమ్మెల్యే, రోజా ఆరోపించారు.

వైకాపా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా లో పాల్గొన రోజా పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా పవన్ ఇప్పుడు మాట్లాడడం లేదని, ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షి పై టిడిపి ఎమ్మెల్యే దౌర్జన్యం జరిగినా పవన్ కళ్యాణ్‌ ఒక్క మాట మాట్లాడలేదని , ప్రత్యేక హోదా పై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఏమిటని ఆమె ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె అన్నారు , ఏ ప్యాకేజీలు ఆయనను మాట‌్లాడనివ్వకుండా చేస్తున్నాయని ప్రశ్నించారు. జగన్ కు పవన్ సంఘీబావం చెప్పాలి ఆమె డిమాండ్ చేసారు