రిషికేశ్వరి అర్ధనగ్నంగా తిప్పిన సీనియర్

Ragging-drives-Nagarjuna-University-student-to-suicideఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాo వెలుగులోకి వచ్చింది .

ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్‌ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్‌ గదిలో నడిపించి… దాన్ని సెల్‌లో చిత్రీకరించినట్లుగా దర్యాప్తులో వెల్లడయింది.

ఆ వీడియోను ఇతరులకు పంపించారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామని సీనియర్లు బెదిరించినట్లుగా తెలియవచ్చింది. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో ఇప్పటికే అనిషా, శ్రీనివాస్‌ అనే సీనియర్‌ విద్యార్థులతోపాటు శ్రీచరన్‌ అనే లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబూరావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు