రేవంత్ బజారు రౌడీగా మారడూ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు ప్రభుత్వం, ఇటు తెరాస పార్టీ నాయకులూ సీరియస్ గా ఉన్నారు.

రేవంత్ పై మహబూబ్ నగర్ కు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు మండిపడ్డారు. రేవంత్ వల్ల పాలమూరు ప్రజలు అప్రతిష్ట పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషిగా విడుదలయినట్లు ఉత్సవాలు చేసుకున్నారని ఆరోపించారు.

రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి తప్ప రౌడీలుగా మాదిరి వ్యవహరించకూడదని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి మాటలు చూస్తుంటే, బజారు రౌడీ మాదిరి ,గూండాల మాదిరి వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఎదిఎమైన రేవంత్ కొరకురాని కొయ్యగ మారడూ.