రేవంత్ రెడ్డి కేసును సీబీఐకు అప్పగించాలి

revanth-reddyఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలైంది. లాయర్‌ పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

మరోవైపు ..నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో తెలంగాణా రాష్ట్ర నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఏం చెప్పారో తెలుసుకోవాలని , ఆయన వాంగ్మూల సర్టిఫైడ్ కాపీని తనకు అందజేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి న్యాయవాదులు శుక్రవారం పిటీషన్ దాఖలు చేశారు.

స్టీఫెన్ సన్ వాంగ్మూల సర్టిఫైడ్ కాపీని పరిశీలించిన తరువాతనే ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని రేవంత్ తరపు న్యాయవాదులు వివరించారు.