తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వచు :పవన్ కళ్యాణ్

pk2జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ , కాపు కాపు రిజర్వేషన్లపై తెలుగు దేశం పార్టీ ఇచ్చిన హామీ పై ఇలా స్పందించారు .

కాపు రిజర్వేషన్లపై అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. కానీ కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వలేపోతే ఆ పరిస్థితిని ప్రభుత్వం ప్రజలకు వివరించాలని , బిసిలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేష్లు ఇవ్వగలిగితే ఇస్తామని చెప్పండని ఆయన అన్నారు.

తాను ఏ ఒక్క కులం కోసమో పోరాడే వ్యక్తిని కాదని, తను కులంకోసం కాదు.. ప్రజలకోసం పోరాటం చేస్తాను అన్నారు , పవన్‌ కళ్యాణ్‌ . తాను జాతి సమగ్రతను కోరుకునే వ్యక్తినని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని తాను నడపడం లేదని, పాలనలో తాను జోక్యం చేసుకోవడం లేదని అన్నారు.

బిసిలకు 50% కన్న రిజర్వేషన్లు ఉండాలంటే , రాజంగా సవరణ అవసరం , కానీ తమిళనాడులో  బిసిలకు  69% రిజర్వేషన్లు  ఉన్నాయి   తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించాలని అన్నారు.  మిగతా బీసీ కులాలకు నష్టం వాటిల్లకుండా కాపులకు న్యాయం చేయగలిగితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాళ్లు అవుతారు