అగ్రి గోల్డ్ బాధితులకు హై కోర్టులో ఊరట

agrigoldఅగ్రి గోల్డ్ బాధితులకు హై కోర్టులో ఊరట లభించింది. సంస్థ ఆస్తులు ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు డబ్బు చెల్లించాలని అగ్రిగోల్డ్‌ సంస్థకు హైకోర్టు ఆదేశించింది. డిపాజిటర్లకు బకాయిలు చెల్లించే క్రమంలో అమ్మకం సర్టిఫికెట్లు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది

అగ్రిగోల్డ్ కు సంబందించిన వాజ్యంపై విచారణ చేసిన హైకోర్టు ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఆస్తుల అమ్మకాలను సంస్థే చేపడితే అందుకు అనుమతిస్తామని చెప్పింది. చెల్లింపులను బట్టి డిపాజిటర్లకు సేల్స్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తామంది హైకోర్టు. తమకు ఆరువందల కోట్ల ఆస్తులు, ఐదువందల కోట్ల అప్పులు ఉన్నాయని అగ్రిగోల్డ్ తెలిపింది, తదుపరి విచారణను 24 కు వాయిదా వేసింది.