పవన్ – ప్రభాస్ ఫ్యాన్స్ మద్య గొడవకు కారణం ఏంటి ?

pawan-prabhasపశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌‌ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ మద్య గొడవకు అసలు కారణం ఏమనగా … బాహుబలి సినిమా ఈ ఇద్దరు అగ్రహీరోల మధ్య పోటీకి కారణం ఆయింది .

బాహుబలి సినిమా విడుదల తరువాత రాజులు ప్రభాస్ ఫ్లెక్సీలతో హల్ చల్ చేస్తున్నారు, బాహుబలి రికార్డు లని ప్లెక్సీల ద్వార గొప్పలకు పోయారు , దానిని కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తుంటే. మరోపక్క పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ హీరోకి సాటేలేరంటూ వ్యవహారించడంతో పాటు పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోకు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో , ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది .

ఇది చివరకు రెండు కులాల ఘర్షణగా మారిపోవడంతో భీమవరంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. సుమారు 27మంది పవన్‌ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా వారి మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారని సమాచారం.