మీడియాలో వచ్చిన కధనాలు పై ఆవేదన వ్యక్తం చేసిన రవితేజ

Ravi Teja at Bharath 11th day ceremony (10)ప్రముఖ నటుడు రవితేజ మీడియాలో వచ్చిన కధనాలు పై ఆవేదన వ్యక్తం చేశారు .

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భరత్‌ను కడసారి చూడలేకనే.. అంత్యక్రియలకు తానుగానీ, తన తల్లిగానీ వెళ్లలేదని, భరత్‌ మరణం గురించి తెలిసిన వెంటనే తమ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెంది కుప్పకూలారని, భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాని విషయంలో సోషల్‌ మీడియాలో, కొన్ని చానెళ్లలో వచ్చిన కథనాలు సరికావని, అవి అసత్య ప్రచారాలని, హీరో రవితేజ తెలిపారు.

సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు చాలా బాధించాయని, తమ్ముడిని ఆ స్థితిలో చూడలేక రాలేకపోయాను, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌తో అంత్యక్రియలు చేయించామనడం అవాస్తవం, సోషల్‌ మీడియాలో తమ కుటుంబం గురించి పరిధిని అతిక్రమించి రాస్తున్నారని రవితేజ అన్నారు.

భరత్ అంత్యక్రియలను చిన్నాన్న నిర్వహించారని ఆయన చెప్పారు.తెల్లవారే షూటింగ్ కు వెళ్లాలన్నది వాస్తవం కాదని, ఆ తర్వాత రోజు వెళ్లానని, దయచేసి ఇలాంటి కథనాలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు.