చిరంజీవి సినిమాకు మెగా పవర్ స్టార్ ఫైట్ మాస్టర్

chiranjeeviమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న సినిమా విషయం. ఈ సినిమాలో రాంచరణ్ ఫైట్ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో చిరంజీవి కనబడనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి ఓ సినిమా స్టార్ పాత్రలో కనిపించబోతున్నారని, ఆ సినిమాకు చరణ్ ఫైట్ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని టాలీవుడ్ వర్గాల భోగట్టా.ఇది వరకు చిరంజీవి, చరణ్ కలిసి ‘మగధీర’లో ఓ డాన్స్ సీన్‌లో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి ఓ ఫైట్ సీన్‌లో కనిపించనుండడం విశేషం.