సానియా మిర్జాకు రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు

saniaభారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డును భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ సంచలనం సానియా మిర్జాకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం అవార్డుల ఎంపిక కమిటీ సానియా పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం సానియా విమెన్స్ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును చేరుకున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల టెన్నీస్ స్టార్ తన కెరీర్‌లో మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్స్‌ను సాధించింది.

సానియాతో పాటు మరో 17మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్రం ప్రకటించింది. క్రికెటర్ రోహిత్ శర్మ, షూటర్ జీతూ రాయ్ , జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, హాకీ ఆటగాడు శ్రీజేష్, రెజ్లింగ్ క్రీడలో బజ్ రంగ్, బబిత, అథ్లె‌ట్ పూవమ్మ, షట్లర్ శ్రీకాంత్, బాక్సర్ మన్‌దీప్ జంగ్రా తదితరులున్నారు.