రాజమౌళి మాయ తెలిసిపోయింది

బాహుబలి సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. మరోవైపు రాజమౌళి ఈ సినిమాలోని ధీవర పాటకు సంబంధించిన చిత్రీకరణపై వీడియోను విడుదల చేశాడు. ప్రేయసి తమన్నాను తలచుకుంటూ జలపాతాల మధ్య చేసే విన్యాసాలను ఎలా చిత్రీకరించామన్నది చూపుతూ మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ధీవర సాంగ్ మేకింగ్ వీడియోలో రాజమౌళి చేసిన మాయ అంతా తెలిసిపోయింది. ధీవర పాట రిలీజ్‌కు ముందు ప్రభాస్ నిజంగానే కొండలు ఎక్కేశాడు. జలపాతాలు దాటేశాడని అనుకోన్నవారు, ఒక్కసారిగా షాక్ తిన్నారు.

బాహుబలి సినిమాను విజువల్ ఎఫెక్ట్స్‌తో మాయచేశారని చాలామందికి తెలుసు. కానీ.. ఆ మాయను కళ్లారా చూసిన తర్వాత ప్రేక్షకులకు థ్రిల్ మాయమైంది అని టాక్ .

dheevara1 dheevara2