కెసిఆర్ వెంటే నడుస్తా : రాజయ్య

rajaiah-trsతెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య వరంగల్ పార్లమెంటుకు త్వరలో జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని తాను ఖండిస్తున్నానన్నారు. తాను పార్టీ మారతానని వస్తున్న వార్తలను ఖండించారు.

రాజయ్య కాంగ్రెస్ లో చేరి వరంగల్ నుంచి ఎమ్.పిగా పోటీచేస్తారని మీడియాలో వస్తున్న కధనాలు ఊహాజనితమేనని ఆయన స్పష్టం చేశారు. తాను టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వెంటే నడుస్తానని చెప్పారు.కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా పాల్గొంటానని ఆయన అన్నారు.