నిజాం కాలేజీ లో ర్యాగింగ్ కలకలం

nizam-collegeఎపిలో ర్యాగింగ్ తో నాగార్జున యూనివర్శిటీలో రితేశ్వరి సూసైడ్ మరువకముందే , తెలంగాణలో హైదరాబాద్ లో నిజాం కాలేజీ లో మరో ర్యాగింగ్ కలకలం రేపుతోంది.

నిజాం కాలేజీకి చెందిన బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని రాజేశ్వరి అదృశ్యం అయింది , రాజేశ్వరి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. థర్డ్ ఇయర్ విద్యార్థి రాజశేఖర్ తనను వేధిస్తున్నాడని, వేధింపులకు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు తెలిపింది. విచారణ చేపట్టిన పోలీసులు సీనియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.