ప్రత్యూష బెనర్జీ రెండు నెలల గర్భవతి

pratyusha-banerjee-630చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ ,ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న నేపద్యంలో వైద్యులు శవపరీక్ష చేసినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి అని వెల్లడైంది.

ఆమె బాయ్ ప్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ఆదివారం నాడు పోలీసుల ఎదుట హాజరుకావల్సి ఉన్నా వెళ్లలేదు. ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు రాహుల్ కారణం కాదని పోలీసులు తేల్చారు. ప్రత్యూష తల్లిదండ్రులు కూడా రాహుల్ పై ఫిర్యాదు చేయలేదు .

ప్రత్యూష ఆర్దిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అబిప్రాయపడ్డారు . ప్రత్యూష అంత్యక్రియలు ఆమె కోరిక మేరకు పెళ్లికూతురి గెటప్ లోనే చేశారు.

ముంబైలో ఆమె తన ప్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.