నల్లపురెడ్డి అడుగులు టీడీపీ వైపు ?

prasanna-kumar-reddyనెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల రీత్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నారు

ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం, ఆయనను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కోవూరు నుంచే పోటీచేస్తానని ఆయన తెలిపారు.

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందుకే టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జరుగుతోందని సమాచారం . వెంటనే జగన్ పార్టీని విడిచి టీడీపీ లో జంప్ చేస్తే బాగుండదని ఇలా మెల్లగా జరుకొంటునారని ప్రచారం జరుగుతోంది .