ఇప్పుడు ప్రభాస్ నెంబర్ వన్ హీరో

Prabhas-Bahubali-Photosనిన్నటి వరకు టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకున్న హీరోనే నెంబర్ వన్ అన్నారు . దీనిని బట్టి ఇప్పుడు మాత్రం అందరూ ఖచ్చితంగా చెబుతున్నారు ప్రభాస్ నెంబర్ వన్ హీరో అని.

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. మిర్చి హిట్ తర్వాత బాహుబలి సినిమా చేయడంతో ప్రభాస్ కు కోట్ల రూపాయల పారితోషకం ముట్టిందట. టాలీవుడ్ లో ఇప్పుడు అత్యధిక రెమ్యునిరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్. తెలుగులోనే కాదు సౌత్ లోనే రూ.25 కోట్ల పారితోషకం అందుకుంటున్న .

నిన్నటివరకు సౌత్ లో పవన్, మహేష్, రజనీ, కమల్ మాత్రమే రూ.15 కోట్లకు పైగా పారితోషకం తీసుకున్నారని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ స్టార్లను కూడా బీట్ చేసి ప్రభాస్ రూ.25కోట్లు తీసుకుంటున్నాడట. బాలీవుడ్ లో అమీర్, సల్మాన్, షారుక్, హృతిక్ ల సరసన ఇప్పుడు ప్రభాస్ కూడా సౌత్ లో కోట్ల పారితోషకం తీసుకుంటున్న హీరోగా నిలిచాడు.