ప్రభాస్ – అనుష్క డేటింగ్ లో ఉన్నార ?

prabhas-anushkaటాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ప్రభాస్ , అనుష్కలే ముందు వరసలో ఉన్నారు. బాహుబలి సినిమా గురించి ఎంత చర్చ జరుగుతుందో అంతకన్నా ఎక్కువ రచ్చ వీళ్లిద్దరి గురించి జరుగుతోంది

టాలీవుడ్ లో కుర్రహీరోలంతా 30 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసేసుకొని తండ్రులు కూడా అయిపోయారు. చివరకు ప్రభాస్ ఫ్రెండ్ గోపిచంద్ కూడా తండ్రయ్యాడు. కానీ ప్రభాస్ ఇంతరకు పెళ్లి ఆలోచన దాకా రాలేదు. అటు హీరోయిన్లలో 30 ప్లస్ ఎప్పుడో దాటిపోయిన భామ అనుష్క. పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నా పెళ్లి తేదీ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.

మరోపక్క వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపించింది. బాహుబలి సినిమా కోసం రెండేళ్లు పనిచేయడంతో ఆ సమయంలో ఇద్దరి మనసులు దగ్గరయ్యారని త్వరలోనే జోడీగా మారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.